
విశాఖపట్నం, 7 డిసెంబర్ (హి.స.)
విశాఖపట్నం సింహాచలంలో (Simhachalam) కొలువుదీరిన వరాహ లక్ష్మీనరసింహ స్వామికి ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కోహ్లీకి ఘన స్వాగతం పలికారు. దేవాలయాన్ని సందర్శింపజేశారు. స్వామివారిని దర్శింప చేయించి తీర్థప్రసాదాలను ఇవ్వగా వాటిని విరాట్ కోహ్లీ స్వీకరించారు. దర్శనానంతరం ఆలయ ఆవరణలోని మండపంలో కోహ్లీ ఆసీనులయ్యారు. ఈ క్రమంలో దేవాలయ అధికారులను కోహ్లీని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పరమ పవిత్రమైన స్వామి వారికి చిత్రపటాన్ని భారత్ క్రికెట్ ఆటగాడైన విరాట్ కోహ్లీకి అందజేశారు. స్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా ఎంతో పారవశ్యానికి లోనైనట్లు విరాట్ పేర్కొన్నారు. దర్శనం చేయించినందుకు, తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి పరమ పవిత్రమైన చిత్రపటాన్ని అందించినందుకు గానూ దేవాలయ అధికారులకు ధన్యవాదాలను తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV