
డల్లాస్, 7 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా డల్లాస్ చేరుకున్న ఆయనకు అక్కడ ప్రవాసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న లోకేష్ నేడు డల్లాస్ లో తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. డల్లాస్ నగరంలో వేలాది మంది తెలుగు ప్రవాసులను ఉద్దేశిస్తూ మంత్రి నారా లోకేష్ భావోద్వేగంగా మాట్లాడారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన ఎన్ఆర్ఐలను “Most Reliable Indians – MRIs”గా అభివర్ణించారు. ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లలో 164 సీట్ల చారిత్రాత్మక విజయం సాధించడంలో ప్రవాసుల పాత్ర అమూల్యమని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV