
యాదాద్రి భువనగిరి, 9 డిసెంబర్ (హి.స.)
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా
ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళా సంఘం సభ్యులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు వినియోగంపై దిశానిర్దేశం చేయాలని సూచించారు. డబ్బు తీసుకొని ఓటు వేసినట్లయితే మీ గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని, నీతి నిజాయితీ గల నిస్వార్థ ప్రజా ప్రతినిధిని గుర్తించి ఓటు వేయాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు