ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్
నల్గొండ, 9 డిసెంబర్ (హి.స.) గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మంగళవారం నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏ
నల్గొండ కలెక్టర


నల్గొండ, 9 డిసెంబర్ (హి.స.)

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మంగళవారం నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీకి అవసరమయ్యే ఏర్పాట్లను నల్లగొండ మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఉద్యోగి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande