
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్
పరిధిలో 10 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వులను పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 9 మందికి పోస్టింగ్లు ఇవ్వగా.. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్లు క్యాస్ట్రోను మాత్రం రేంజ్కు సరెండర్ చేశారు. ఈ ఉత్తర్వులు ఇన్ స్పెక్టర్ల పనితీరుకు అనుగుణంగా జరిగాయని పోలీసు వర్గాలు చెప్పుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు