పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ
తెలంగాణ, ఆదిలాబాద్. 10 జూన్ (హి.స.) ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శివాజీ చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంకు వారి సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. బ్యాంకు సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్ల
ఆదిలాబాద్ ఎస్పీ


తెలంగాణ, ఆదిలాబాద్. 10 జూన్ (హి.స.)

ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శివాజీ చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంకు వారి సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. బ్యాంకు సిబ్బందితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారితో శివాజీ చౌక్ నిత్యం రద్దీగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడానికి, అవాంఛనీయ సంఘటనలో జరిగిన వెంటనే అత్యవసర సమయంలో పోలీసు సిబ్బంది స్పందించే విధంగా సబ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande