జైనాబ్ తో అక్కినేని అఖిల్ మూడు ముళ్ల బంధం …
హైదరాబాద్, 6 జూన్ (హి.స.) టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం
అఖిల్ అక్కినేని


హైదరాబాద్, 6 జూన్ (హి.స.)

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది.ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు, ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వేడుకకు మరింత శోభను చేకూర్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande