హైదరాబాద్, 19 జూలై (హి.స.)
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వాన కురిసింది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ