సత్తెనపల్లి, 19 జూలై (హి.స.)
: వైకాపా()కు చెందిన మాజీ మంత్రి విడదల రజిని i)కి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం జగన్ ( రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విడదల రజినికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈనెల 20న విచారణకు హాజరుకావాలని సూచించారు.
గత నెల 18న సత్తెనపల్లిలో నిబంధనలు ఉల్లంఘించి బల ప్రదర్శన చేయడం, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడంపై నమోదైన కేసులో 113 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో వైకాపా నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వైకాపా మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైకాపా నేత గజ్జల సుధీర్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ