బోనాల ఏర్పాట్లలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, దేవాదాయ శాఖల సేవలు గ్రేట్.. మంత్రి పొన్నం
హైదరాబాద్, 20 జూలై (హి.స.) లాల్ దర్వాజా బోనాల సందర్భంగా సింహవాహిని అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంమీడియాతో మాట్లాడు
మంత్రి పొన్నం


హైదరాబాద్, 20 జూలై (హి.స.)

లాల్ దర్వాజా బోనాల సందర్భంగా సింహవాహిని అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంమీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని.. మంచి వర్షాలతో పాడి పంటలు సంవృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నా అని చెప్పారు.

హైదరాబాద్ బోనాల ఏర్పాట్లలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. హైదరాబాద్ ప్రజలు బోనాల పండగకు ఆతిథ్యం ఇచ్చారు. అమ్మవారి కటాక్షం, లక్ష్మి కటాక్షం, విద్యా కటాక్షం ఉండేలా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అమ్మవారి బోనాల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande