రియాద్, 20 జూలై (హి.స.)
సౌదీ అరేబియా యువరాజు “అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్” కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 36 సంవత్సరాలు .కాగా.. గత ఇరవై ఏళ్లుగా కోమాలోనే ఉన్నారు..గ్లోబల్ ఇమామ్ కౌన్సిల్ ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ విషాదకర ఘటనతో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించింది.స్లీపింగ్ ప్రిన్స్..అల్ వలీద్ “స్లీపింగ్ ప్రిన్స్”గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1990 ఏప్రిల్‌లో జన్మించిన అల్ వలీద్.. బ్రిటన్‌లోని ఒక సైనిక కళాశాలలో చదువుతుండగా 2005లో జరిగిన కారు ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన రియాద్‌లోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ట్యూబ్ ద్వారా ఆహారం, వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..