హైదరాబాద్, 20 జూలై (హి.స.)
హైదరాబాద్ నగరంలోని బోరబండలో ఆషాఢ బోనాల వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హాజరై.. అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణను దోచుకోవడానికి మరలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదని హెచ్చరించారు.
'తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం బంగారు బాతు. బంగారు బాతును విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వచ్చి మనల్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వారిని ఎదురించాలి. రాష్ట్రంలోకి వస్తున్న శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణను దోచుకోవడానికి మరలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. పిడికిలి బిగించి గుండెపై చేయి వేసి జై తెలంగాణ అనండి. తెలంగాణ ప్రజల గుండెల్లోనే తెలంగాణ ఉంది, ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడూ జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం అని విజయశాంతి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్