పూర్బాచల్ ప్లాట్ల కేటాయింపు కేసు.. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా రాజధాని ఢాకా సమీపంలోని పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలపై షేక్
షేక్ హసీనా


హైదరాబాద్, 02 ఫిబ్రవరి (హి.స.)

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు

మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా రాజధాని ఢాకా సమీపంలోని పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలపై షేక్ హసీనా పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు, ఆమెను దోషిగా తేలడంతో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో, ఆమె గైర్హాజరీలోనే కోర్టు ఈ తీర్పును వెలువరించడం గమనార్హం.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande