
ముంబై, 02 ఫిబ్రవరి (హి.స.)సోమవారం బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. ఆదివారం ధరలు తగ్గిపోగా.. నేడు కూడా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులు, దేశ బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఆదివారం గోల్డ్ రేట్లల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. గత కొంతకాలం నుంచి ఒక్కసారిగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడిగా నూతన వ్యక్తిని ట్రంప్ త్వరలో నియమించనున్నారనే వార్తలతో గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోతున్నాయి. ఊహించని రీతిలో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంలో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పెరగ్గా.. ఈ వారంలో దిగజారిపోతున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న గోల్డ్ తగ్గగా.. సోమవారం కూడా డౌన్ అయ్యాయి. ఫిబ్రవరి 2న దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,60,570 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,60,580 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,190గా ఉంది. ఆదివారం ఇది రూ.1,47,200 వద్ద స్దిరపడింది-ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,60,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,47,190 వద్ద స్ధిరపడింది.చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,62,540గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,62,550 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,990 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,49,000గా ఉంది
-
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV