తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు.. ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?
తెలంగాణలో బక్రీద్ సెలవు మార్పు.. ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?
Bakrid


హైదరాబాద్, 23 మే (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ పండగ సెలవుదినాన్ని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27, 2026 (బుధవారం) ఇవ్వాల్సిన బక్రీద్ సెలవును మే 28, 2026 (గురువారం) నాటికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వర్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం ఈ మార్పును ఖరారు చేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (N.I. Act) ప్రకారం మే 28వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేరుతో ఉత్తర్వులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు ఈ మార్పు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande