కేబినెట్ విస్తరణతో పీసీసీకి సంబంధం లేదు.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ విస్తరణతో పీసీసీకి సంబంధం లేదు.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Mahesh Kumar


హైదరాబాద్, 23 మే (హి.స.)

కేబినెట్ విస్తరణతో పీసీసీకి

సంబంధం లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో నేడు ఆయన మాట్లాడుతూ. ఫ్యూచర్ సిటీని హరీష్రరావు రద్దు చేస్తామంటున్నారని, బీఆర్ఎస్ వచ్చేది లేదు.. రద్దు చేసేది లేదని అన్నారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి తలమానికం కొనియాడారు. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్లో నరకం కనిపిస్తోందని, అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేశామన్నారు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందని వ్యాఖ్యానించారు. అంటూ

మోడీ వచ్చి అరకొర నిధులు ఇచ్చి వెళ్లారని, కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన మోడీకి లేదని చెప్పారు. ఓటు హక్కు కాలరాసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించి, 31 లక్షల ఓట్లు చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం మారింది 31 లక్షల ఓట్లతోనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని, కేటీఆర్ దగ్గర ఉన్న లెక్కలు తప్పని అన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగిందని అందుకే కొనుగోలులో కొంత ఆలస్యం అవుతోందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande