
కర్ణాటక, 23 మే (హి.స.)
జాతీయ రహదారిపై కారు, లారీ
ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం సంఘటన కర్ణాటకలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. లాడ్లాపూర్ సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ఒక క్రూజర్ వాహనం, ఎదురుగా వస్తున్న లారీని ముఖాముఖి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి క్రూజర్ ముందుభాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘోర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వాహనం లోపలే ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను క్యాష్వార్, హుస్సేన్ షా, మహబూబ్ అలీ, రసూల్ బీ, ఫాతిమా అలీలుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలిగిపోయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఒకేసారి మరణించడంతో బాధితుల స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..