శ్రీ.వారి.పాదాల చెంతకు రెండున్నర కిలోమీటర్లు మెటా నాట్య నీరాజనం
శ్రీ.వారి.పాదాల చెంతకు రెండున్నర కిలోమీటర్లు మెటా నాట్య నీరాజనం
శ్రీ.వారి.పాదాల చెంతకు రెండున్నర కిలోమీటర్లు మెటా నాట్య నీరాజనం

అమరావతి, 24 మే (హి.స.)

: శ్రీవారి పాదాల చెంతకు రెండున్నర కిలోమీటర్ల మేర నాట్య నీరాజనం సమర్పిస్తూ పధ్నాలుగేళ్ల చిన్నారి అబ్బురపరిచింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం రెండున్నర కిలోమీటర్ల మేర కొండ విస్తరించి వుంటుంది. పట్టణానికి చెందిన యాతం జోషిత స్వామివారి ఆలయం వరకు భరతనాట్యం చేసుకుంటూ శనివారం నాట్య నీరాజనం అర్పించింది. ఆమె తల్లి మ హిళా పోలీసు సునీత భరతనాట్య కళాకారిణి. ఆమెను చూసి నాట్యంపై ఆసక్తి పెంచుకున్న జోషిత తల్లికి నాట్యం నేర్పిన గురువు రూపాదేవి వద్ద నేర్చుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande