తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!
తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!
Vijay


చెన్నై , 24 మే (హి.స.)

తమిళనాడులో గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయం వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంతో రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు విద్యుత్ బిల్లు సున్నాకు చేరనుంది. ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న ఈ తొలి కీలక నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

ఈ పథకం అమలు కోసం తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDCL) తమ బిల్లింగ్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తోంది. ప్రభుత్వ నూతన విధానానికి అనుగుణంగా అర్హుల గుర్తింపు, సబ్సిడీ లెక్కింపు, బిల్లుల జారీ వంటి మార్పులను సాఫ్ట్వేర్లో పొందుపరిచినట్లు టీఎన్పీడీసీఎల్ అకౌంట్స్ విభాగం వెల్లడించింది. క్షేత్రస్థాయి సిబ్బందికి దీనిపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన వినియోగదారులకు ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధి చేకూరేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande