ఐపీఎల్ లో నేడు వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై VS రాజస్థాన్
ఐపీఎల్ లో నేడు వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై VS రాజస్థాన్
Ipl


ముంబై, 24 మే (హి.స.)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మే 24న వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ముంబై ఇండియన్స్ VS రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా, ప్లేఆఫ్ రేసులో ఉన్న ఇతర జట్ల భవితవ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే జట్టు 16 పాయింట్లకు చేరుకుని ప్లేఆఫ్ అవకాశాలను మరింత బలపరుచుకుంటుంది. దీంతో ఇతర జట్లపై ఒత్తిడి పెరగనుంది.

ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ గెలుపు ఎంతో కీలకం. ప్రస్తుతం జట్టు తక్కువ పాయింట్లతో దిగువ స్థానాల్లో కొనసాగుతోంది. అయితే మెరుగైన నెట్ రన్డేట్ కారణంగా చివరి స్థానంలో లేదు. ఈ మ్యాచ్లో గెలిచి సీజనను గౌరవప్రదంగా ముగించాలని హార్దిక్ పాండ్యా సేన భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande