జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ
జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ
జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ


అమరావతి , 24 మే (హి.స.)

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా మంత్రి పి. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రక్తచరిత్ర ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసని, జగన్ అండ్ కో ఎన్ని అసత్యాలు మాట్లాడినా జనం నమ్మే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం, వైసీపీ రక్తచరిత్ర ప్రజలకు తెలుసు కాబట్టే... గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, వచ్చే ఎన్నికల్లో వారికి సున్నా (జీరో) సీట్లు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత వైసీపీ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను ఎందుకు వినియోగించలేదో జగన్ సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ నిధులను కూడా జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలను నిర్వహించి, ఎలాంటి అవినీతి లేకుండా నిజాయతీగా ఉద్యోగాలను కేటాయించిందని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande