సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
కోల్కతా , 24 మే (హి.స.)నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నా
Suvendu Adhikari


కోల్కతా , 24 మే (హి.స.)నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ పాలకుడు మాత్రం ఓట్ల వేటలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ మసీదుపై మరోసారి చర్చ మొదలైంది.

‘‘గౌరీపసూర్ జామే మస్జిద్’’ లేదా ‘‘బంక్రా మసీదు’’గా పిలిచే ఈ మసీదు ఏయిర్పోర్టు రన్ వే పక్కనే ఉంది. దీంతో ఇది భద్రతా పరమైన ఆందోళనల్ని పెంచుతోంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ జోన్లోనే ఈ మసీదు ఉంది. సెకండ్ రన్వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. నియమాల ప్రకారం కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. దీని కారణంగా విమానాలు దిగే టచ్ డౌన్ పాయింట్ను 88 మీటర్లకు మార్చాలి వచ్చింది.

పెద్ద విమానాలు ల్యాండ్ కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande