
నోయిడా,, 24 మే (హి.స.)
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) పరీక్షలో హైటెక్ కాపీయింగ్ గుట్టును యూపీలోని నోయిడా అధికారులు రట్టు చేశారు. తమకు నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తే.. ఎస్ఎస్సీ ఉద్యోగాల పరీక్షలో తప్పక పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి అధునాతన పద్ధతులతో పరీక్ష పేపర్ను హ్యాకింగ్ చేసిన ముఠాను అధికారులు పట్టుకున్నారు.
గ్రేటర్ నోయిడాలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఈ ముఠా ప్రధాన సూత్రధారి సహా ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.50 లక్షలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, పరీక్షకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులు అవలంబిస్తూ పరీక్ష జరుగుతున్నప్పుడు అభ్యర్థులకు జవాబులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.దాని కోసం సర్వర్ను కూడా హ్యాక్ చేసి ప్రశ్నపత్రం సంపాదించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi