
నెల్లూరు, 24 మే (హి.స.)
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తో నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు,కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడును వర్చువల్ పద్ధతిలో అత్యంత పకడ్బందీగా నిర్వహించడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయటంతో పాటు, మహానాడుకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, కార్యాచరణపై సమాలోచన చేశారు. వర్చువల్ మహానాడు కు సంబంధించి ఎవరు గైర్హాజరు కాకుండా నిర్వహించాలని సూచించారు.
పార్టీ జెండా అజెండాను పార్టీ క్యాడర్ లోనూ, కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చేలా వర్చువల్ మహానాడు ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో దిశా నిర్దేశం చేసి ఉన్నాడని సూచించారు. యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి ఈ మహానాడు నిర్వహించాలని చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV