భారత అధికారిణికి ఐరాస మిలిటరీ జెండర్ అవార్డ్
భారత అధికారిణికి ఐరాస మిలిటరీ జెండర్ అవార్డ్
భారత అధికారిణికి ఐరాస మిలిటరీ జెండర్ అవార్డ్


24 మే (హి.స.)

న్యూఢిల్లీ

లెబనాన్లో ఐక్య రాజ్య సమితి(ఐరాస) శాంతి పరిరక్షణ మిషన్లో సేవలందిస్తున్న భారత సైనికాధికారిణి మేజర్ అభిలాష బరాక్కు 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమై ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది. మేజర్ బరాక్ ప్రస్త్తుతం లెబనాన్లోని ఐరాస మధ్యంతర దళంలో మహిళా బృందం కమాండర్గా భారత బెటాలియన్లో సేవలందిస్తున్నారు. ఆమె భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్ కూడా. ఈ గౌరవాన్ని అందుకున్న మూడో భారతీయురాలిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఐరాస శాంతి దళాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించటంలో, భద్రతా మండలి 1325 తీర్మానాన్ని అమలు చేయడంలో అసాధారణమైన నిబద్ధతను కనబర్చిన వాళ్లను ఈ అవార్డుతో గౌరవిస్తారు. మే 29న న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డును ఆమె అందుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande