
ఆసిఫాబాద్, 09 జూన్ (హి.స.) ఆసిఫాబాద్ జిల్లాలోని జైనురులో మంగళవారం నిరుద్యోగ యువతి, యువకులకు మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు జాబ్ మేళా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా జై నూర్ సిర్పూర్ (యు) లింగాపూర్ మూడు మండలాల నిరుద్యోగ యువతీ యువకులకు జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మూడు నెలలు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి చేరాలన్నారు. గ్రామాల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఆరు కోర్సులలో శిక్షణ తీసుకొని మీకు నచ్చిన కోర్సులో పూర్తి చేసినట్లయితే వెంటనే జీఎంఆర్ సంస్థ తరఫునుంచి ప్రముఖ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తాసిల్దార్ ఆడబీర్షా, సీఐ రమేష్, జీఎంఆర్ మొబలైసింగ్ మేనేజర్ పిజె మనోహర్, రామకృష్ణ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..