ఈ గచ్చిబౌలిలో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ..! బంగారం, వజ్రాలతో పరార్ (update)
ఈ గచ్చిబౌలిలో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ..! బంగారం, వజ్రాలతో పరార్
Robbery


హైదరాబాద్, 09 జూన్ (హి.స.)

హైదరాబాద్ నగరంలో మరో నేపాలి

గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.

సీసీటీవీ పుటేజీ వివరాలతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, నెల రోజుల క్రితమే సదరు వ్యాపారి నేపాల్కు చెందిన దంపతులను పని మనుషులుగా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతుల కోసం తీవ్రంగా గాలించారు. యూపీ పోలీసుల సహకారంతో చివరికి నిందితులను పట్టుకున్నారు. వారిని అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కిలో బంగారు నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లిన నేపాలీ దంపతుల్ని అరెస్ట్ చేశారు. వీరిని సదరు వ్యాపారి నెలరోజుల క్రితమే పనిలో పెట్టుకోగా.. ఇటీవలే వ్యాపారి కుటుంబం ఓ పనినిమిత్తం ముంబైకి వెళ్లింది. వారు తిరిగివచ్చే సరికి ఇంట్లోని నగలు, వజ్రాలు కనిపించకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితుల్ని హైదరాబాద్ కు తీసుకువచ్చిన అనంతరం.. మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించనున్నారు. ఆపై కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande