
హైదరాబాద్, 09 జూన్ (హి.స.)
రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతలను నిర్వహిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా హ్యాకింగ్కు గురైందని సమాచారం. మే 22వ తేదీన సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తుండగా.. దాదాపు 20 రోజులు అవుతున్నా ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించకపోవడం గమనార్హం.
ఒకప్పుడు దేశంలో అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారిక ఖాతానే హ్యాకింగ్కు గురైందనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ నేరాల నియంత్రణ వంటి బాధ్యతలపై దృష్టిపెట్టాల్సి సంస్థ.. తన విధులను వదిలేసి సోషల్మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టిపెడితే ఇలాగే అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు