రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి
రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి
Deputy CM


జనగామ, 09 జూన్ (హి.స.)

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మంగళవారం జనగామ జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “72 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.14వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయట్లేదు? రాష్ట్రం సేకరించిన మొక్కజొన్నను కూడా కేంద్రం కొనుగోలు చేయాలి. 30 లక్షల పంపుసెట్ల విద్యుత్తు బిల్లులు రూ.14వేల కోట్లు డిస్కమ్లకు చెల్లిస్తున్నాం. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు రూ.5వేల కోట్లు చెల్లిస్తున్నాం. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నాం. దేవాదుల ప్రాజెక్టును గత ప్రభుత్వం గాలికొదిలేసింది. దేవాదులకు నిధులు

మంజూరుతో పనులు వేగంగా సాగుతున్నందున ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం. రైతులకు రూ.22వేల కోట్ల రుణమాఫీ చేశాం” అని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande