
, 09 జూన్ (హి.స.)
రాజమండ్రి,
:గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఆంధ్రా పేపర్ మిల్, రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులకు షాకాజ్ నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించారన్నారు. పేపర్ మిల్ కాలుష్యం కోసం మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేస్తారనే వాదన ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. డైనమిక్ లీడర్ పవన్ కల్యాణ్ పేపర్ మిల్ కాలుష్యం నివారణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
గోదావరి ప్రక్షాళనకు ఏడాదికి రూ.400 కోట్లు చొప్పున కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు. రూ.100 కోట్లు నిధులు మంజూరు అయ్యాయన్నారు. గోదావరి పుష్కరాల కోసం 290 గ్రామాలను అభివృద్ధి చెయ్యాలని తెలిపారు. మునికూడలిలో ఘాట్ నిర్మాణం జరుగుతోందన్నారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న మోదీ పాలన స్పూర్తిగా ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో పూజలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ