టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం...ఒకరు సజీవ దహనం
టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం...ఒకరు సజీవ దహనం
టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం...ఒకరు సజీవ దహనం


అనంతపురం, 09 జూన్ (హి.స.)

జిల్లాలోని డి.హీరేహాళ్ మండలం జూజరకల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. మంగళవారం రహదారి పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల్లో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రహదారిపై నిలిచిన వాహనాలు సజావుగా ముందుకు సాగేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో సజీవదహనమైన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande