సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్: ఢిల్లీలో ఉద్యోగ్ భవన్ కూల్చివేత పనులు ప్రారంభం
సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్: ఢిల్లీలో ఉద్యోగ్ భవన్ కూల్చివేత పనులు ప్రారంభం
సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్: ఢిల్లీలో ఉద్యోగ్ భవన్ కూల్చివేత పనులు ప్రారంభం


న్యూఢిల్లీ, 09 జూన్ (హి.స.)

కేంద్ర ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా చేపట్టినసెంట్రల్ విస్టా పునరాభివృద్ధి

ప్రాజెక్టులోభాగంగా న్యూఢిల్లీలోని ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాల సముదాయంఉద్యోగ్ భవన్ కూల్చివేత పనులుఅధికారికంగా ప్రారంభమయ్యాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950వ దశకం చివరలో నిర్మించిన ఈ చారిత్రక భవనంలో దశాబ్దాలుగా

వాణిజ్య, పరిశ్రమల శాఖలతో పాటు పలు కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలు

కొనసాగాయి. మే నెలలో దీని పక్కనే ఉన్న నిర్మాణ్ భవన్ను కూల్చివేసిన తర్వాత, తాజాగా ఉద్యోగ్ భవన్ను కూడా

తొలగించే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు.ఈ రెండు భవనాలు ఉన్న స్థలంలో

సరికొత్తగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) కింద అత్యాధునిక వసతులతో కూడిన

నూతన భవనాలను నిర్మించనున్నారు. ఇప్పటివరకు ఈ భవనాల నుండి పనిచేసిన మంత్రిత్వ

శాఖలను ఇప్పటికే నూతనంగా నిర్మించిన కర్తవ్య భవన్ సముదాయాల్లోకి విజయవంతంగా

తరలించారు. రాబోయే రోజుల్లోశాస్త్రి భవన్, కృషి భవన్వంటి మరికొన్ని పాత భవనాలను

కూడా ఇదే పద్ధతిలో తొలగించి, మొత్తం 10 నూతన సచివాలయ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర

పట్టణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande