నేడు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితులు, చమురు ధరలు బంగారాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి.
gold


ముంబై, 10 సెప్టెంబర్ (హి.స.) అమెరికా-ఇరాన్ యుద్ధంపై అనిశ్చితులు, చమురు ధరలు బంగారాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 10) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,300 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,440 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,720 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.

బంగారం ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,440గా ఉంది.

-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,300గా ఉండగా.. 22 క్యారెట్లు చూస్తే రూ.1,41,440 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,54,300, 22 క్యారెట్ల రేటు రూ.1,41,440గా కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,450 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,590గా ఉంది

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.1,54,300 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,440 పలుకుతున్నాయి.

వెండి రేట్లు ఇవే..

వెండి ధరలు కూడా పతనమయ్యాయి. గత కొద్ది రోజులుగా స్దిరంగా కొనసాగుతున్న ధరలు.. గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ఉండగా.. నిన్న రూ.2.55 లక్షలు పలికాయి

-చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.

-ఢిల్లీలో కేజీ వెండి రూ.2,49,900గా ప్రస్తుతం ఉండగా.. బుధవారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande