
టెబెట్, 09 సెప్టెంబర్ (హి.స.) టెబెట్లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. టిబెట్లో వచ్చిన భూకంపం కారణంగా నేపాల్లో భూప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. అయితే, టిబెట్లో వచ్చిన భూకంపం తాలూకా తీవ్రత 5.0 మాత్రమేనని ఇండియాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత గురువారం కూడా టిబెట్లో భూకంపం వచ్చింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV