సంభాల్ జిల్లా, 11 మార్చి (హి.స.)
బీజేపీ నేతను దారుణంగా హత్య చేశారు. ప్లాన్ వేసి పథకం ప్రకారం విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే, 60 ఏళ్ల గుల్ఫం సింగ్ యాదవ్, జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్తారా గ్రామంలోని తన పొలంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి, యాదవ్‌ను కలిసేందుకు వచ్చారు. ఆ తర్వాత అతని పక్కనే కూర్చుని, అతని క్షేమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో మంచినీరు కావాలని అడిగారు. యాదవ్ వారికి నీళ్లు ఇచ్చిన తర్వాత, దుండగులు అతనికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల