ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు..!
హైదరాబాద్, 11 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు నేడు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల
ఏసీబీ దాడులు


హైదరాబాద్, 11 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు నేడు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రస్తుతం చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇరిగేషన్ CAD డివిజన్ 8లో పనిచేశారు. ఆయన గతంలో అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనూ పనిచేసారు.

ఇరిగేషన్ శాఖలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన నూనె శ్రీధర్ వాటిలో అక్రమంగా వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఆయన నివాసాల వద్ద, ఇతర సంబంధిత ప్రదేశాలపై కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande