ప్రముఖ సినీ.నటుడు.హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు.వేడుకలు నిమ్మకూరులో.ఘనంగా నిర్వహించారు
అమరావతి, 11 జూన్ (హి.స.) పామర్రు గ్రామీణం, : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగ్రామమైన మండలంలోని నిమ్మకూరులో ఆయన పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ బంధువులు నందమూరి శివరామకృష్ణ, చిన్నారులు కుదురవల్లి
ప్రముఖ సినీ.నటుడు.హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు.వేడుకలు నిమ్మకూరులో.ఘనంగా నిర్వహించారు


అమరావతి, 11 జూన్ (హి.స.)

పామర్రు గ్రామీణం, : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగ్రామమైన మండలంలోని నిమ్మకూరులో ఆయన పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ బంధువులు నందమూరి శివరామకృష్ణ, చిన్నారులు కుదురవల్లి అన్విత్, అశ్వత్‌లు.. స్థానిక ఎన్టీఆర్, బసవతారకం కాంస్య విగ్రహాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ కోశారు. తెదేపా నేతలు కుదురవల్లి రఘురామయ్య, కుదురవల్లి నాగేశ్వరరావు, అనగాని మురళీకృష్ణ, సూరపనేని చంద్రశేఖర్, నల్లూరి ప్రసాద్, జంపాని జయకృష్ణప్రసాద్, నందమూరి ప్రభాకరరావు, సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande