గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
తెలంగాణ, పెద్దపల్లి. 11 జూన్ (హి.స.) జిల్లాలోని గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యా
పెద్దపల్లి కలెక్టర్


తెలంగాణ, పెద్దపల్లి. 11 జూన్ (హి.స.)

జిల్లాలోని గిరిజన గ్రామాల్లో 20న స్పెషల్ క్యాంపు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పీఏం జన్ మాన్, డీఏజేజీయూఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్ మాన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ్ మహా అభియాన్), డీఏజేజీయూఏ ( ధరతి ఆభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్) కార్యక్రమాలను చేపట్టిందని అందులో భాగంగా జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్న మంథని మండలం బట్టుపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామని తెలిపారు.

జూన్ 20న నిర్వహించే క్యాంపులో ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande