తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
హైదరాబాద్, 11 జూన్ (హి.స.) వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మాత్రం ఆయన గట్టిగా ఇరుక్కున్నారు అంటున్నారు తుంగతుర్తి ప్రజలు. నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్
మందుల సామెల్ ఎమ్మెల్యే


హైదరాబాద్, 11 జూన్ (హి.స.)

వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మాత్రం ఆయన గట్టిగా ఇరుక్కున్నారు అంటున్నారు తుంగతుర్తి ప్రజలు.

నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదం అవుతూ... సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ఆ వీడియో. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ హస్తం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఎవరు సంసారి.... ఎవరు సుద్దపూస.... ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. బయటకు వెళ్తే లక్షలు ఖర్చు అవుతున్నాయి. మీరిచ్చే డబ్బులు చిల్లర ఖర్చులకేనంటూ ఎమ్మెల్యే అన్న మాటల చుట్టూ కొత్త వివాదం మొదలైంది. నేనేమైనా మిమ్మల్ని ఎక్కువగా అడిగానా...? గత పదేళ్ళలో ఇచ్చిందే నాకు ఇవ్వమని అడుగుతున్నా అంటూ లిక్కర్ సిండికేట్ వాళ్లతో సూటిగా, సుత్తిలేకుండా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. వాటిని ఎవరో రికార్డ్ చేసి బయటికి వదలడంతో... రచ్చ రచ్చ అవుతోంది. అన్నిటికీ మించి ఎవరు సుద్దపూస అన్న మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంశం అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande