మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి.. మిర్యాలగూడ ఎమ్మెల్యే
తెలంగాణ, మిర్యాలగూడ. 14 జూన్ (హి.స.) మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. శనివారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ కార్యక్రమం చేపట్ట
మిర్యాలగూడ ఎమ్మెల్యే


తెలంగాణ, మిర్యాలగూడ. 14 జూన్ (హి.స.)

మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి

లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. శనివారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమైందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అందులో భాగంగా ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande