మాదాపూర్, గచ్చిబౌలి లోని పబ్ లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్లోని యువత మత్తులో
పబ్బులు


హైదరాబాద్, 14 జూన్ (హి.స.) హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్లోని యువత మత్తులో జోగుతున్నారు. ఇక, పబ్ లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande