ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌ వాంకుడోతు సరిత ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 15 జూన్ (హి.స.) ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత, అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు సీఎం అభినందనలు తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 15 జూన్ (హి.స.)

ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత, అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు సీఎం అభినందనలు తెలియజేశారు.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని వారు పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.

గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత గారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande