హైదరాబాద్, 15 జూన్ (హి.స.) హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ గా రూపొందడం చాలా సంతోషకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని.. ఇక్కడ ఉండే ఇన్ఫ్రా కావచ్చు, డాక్టర్ కావచ్చని తెలిపారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ డాక్టర్అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చాలా వృత్తులు చాలా బిజినెస్‌లు ఉంటాయి. కానీ డాక్టర్‌కు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. వైద్యో నారాయణో హరి అని అంటారని.. తల్లి జన్మనిస్తే ఒక ఆపదలో ఉన్న పేషెంట్ కు పునర్జన్మని ఇచ్చేది డాక్టర్ అని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న డాక్టర్లకు మరింత బాధ్యతగా సేవలు చేసే విధంగా, కొత్తవారిని సేవలు చేసే విధంగా ఈ అవార్డులు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
కరోనా సమయంలో డాక్టర్ల గొప్పదనం బయటపడిందని.. ప్రాణాలను లెక్కచేయకుండా రాత్రింబవళ్ళు కష్టపడ్డారని హరీశ్‌రావు అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్