నిర్మల్ జిల్లాలో బిఆర్ఎస్ నాయకుని కిడ్నాప్ కలకలం
నిర్మల్, 15 జూన్ (హి.స.) నిర్మల్ జిల్లా మామడ మాజీ మండలాధ్యక్షుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ కుమార్ ను గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మామడ మండలం పొనకల్ గ్రామంలో ఆ
కిడ్నాప్


నిర్మల్, 15 జూన్ (హి.స.) నిర్మల్ జిల్లా మామడ మాజీ మండలాధ్యక్షుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ కుమార్ ను గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మామడ మండలం పొనకల్ గ్రామంలో ఆయన నివాసంలో నుంచి వాహనంలో కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగంతకులు కారులో హైదరాబాద్ వైపు తరలించారు.

కారు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిన సమయంలో చాకచక్యంగా హరీష్ కుమార్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని నేరుగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన సంఘటన గురించి అక్కడి పోలీసులకు వివరించారు. సంఘటనపై విచారణ జరుపుతున్నామని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande