యాదగిరిగుట్ట, 15 జూన్ (హి.స.)
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాసంలో పనిమనిషి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం కలకలం రేపింది. సీఐ భాస్కర్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురానికి చెందిన గంధమల్ల రవి(36), అతని భార్య నవిత రెండేళ్ల క్రితం అయిలయ్య నివాసంలో పనిమనుషులుగా చేరారు. సొంత గ్రామం వ్యక్తులు కావడం, నమ్మకంతో ఉంటారని పని కల్పించడంతోపాటు అయిలయ్య తమ భవంతిలోనే ఓ గది కేటాయించారు. రవి తాను చేసిన అప్పులు తీర్చేందుకు గ్రామంలోని ఇంటిని తనఖా పెట్టి మూడేళ్ల క్రితం ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.6 లక్షలు రుణం తీసుకున్నాడు. గ్రామంలో కొందరి వద్ద రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ