హర్యానాలో అదృశ్యమైన మోడల్ హత్య.. కాలువలో శీతల్ మృతదేహం లభ్యం
హర్యానా, 16 జూన్ (హి.స.) హర్యానాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మోడల్ శీతల్ శవమై కనిపించింది. సోనిపట్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. శీతల్ హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. జూన్ 14న ఆమె అదృశ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శవమై కనిప
హర్యానా మోడల్ హత్య


హర్యానా, 16 జూన్ (హి.స.)

హర్యానాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన మోడల్ శీతల్ శవమై కనిపించింది. సోనిపట్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. శీతల్ హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. జూన్ 14న ఆమె అదృశ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా శవమై కనిపించింది. గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తోంది. హర్యానా సంగీత పరిశ్రమలో శీతల్ గుర్తింపు తెచ్చుకుంది.

కాలువలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని సోనిపట్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం స్వాధీనం చేసుకున్నామని.. అది పానిపట్లో అదృశ్యమైన మోడల్ శీతల్ ది గా గుర్తించినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సివిల్స్ ఆస్పత్రికి తరలించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande