తిరుపతి, 16 జూన్ (హి.స.)తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని షార్ కేంద్రానికి(Shaar Center) బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొందరు దుండగులు చెన్నైలోని CISF కార్యాలయానికి కాల్ చేసి షార్‌లో బాంబు పెట్టినట్లు చెప్పారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు షార్‌లో అనువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్స్ ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరి నుంచి వచ్చాయి.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి