200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
మండి: , 17 జూన్ (హి.స.)హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్ర
200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి


మండి: , 17 జూన్ (హి.స.)హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

తీవ్రంగా గాయపడిన వారిని మండి ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande