నిర్వహణ సమస్యలు.. 8 ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
ముంబయి, 20 జూన్ (హి.స.) దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడటం కలవరపెడుతోంది. మరోవైపు, నిర్వహణ సమస్యలూ వెంటాడుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్యకాలంలో పలు విమాన సర్
నిర్వహణ సమస్యలు.. 8 ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు


ముంబయి, 20 జూన్ (హి.స.) దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడటం కలవరపెడుతోంది. మరోవైపు, నిర్వహణ సమస్యలూ వెంటాడుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్యకాలంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఎనిమిది సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది. మెయింటెనెన్స్‌, కార్యాచరణ సమస్యల కారణంగా వీటిని రద్దు చేసినట్లు వెల్లడించింది.

రద్దయిన విమాన సర్వీసులు ఇవే..

దుబాయ్‌ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ906

దిల్లీ నుంచి మెల్‌బోర్న్‌ వెళ్లాల్సిన ఏఐ308

మెల్‌బోర్న్‌ నుంచి దిల్లీ రావాల్సిన ఏఐ309

దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన ఏఐ2204

పుణె నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ874

అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ456

హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ2872

చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ571

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande