వరంగల్, 21 జూన్ (హి.స.)
వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అరెస్టయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, ఏనుగు రాకేశ్ రెడ్డి తదతరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్